Home  »  TV News  »  ఈ వారం టీఆర్పీలో మొదటి స్థానంలో బ్రహ్మముడి సీరియల్!

Updated : Aug 7, 2023

బ్రహ్మముడి సీరియల్ ఈ వారం  టీఆర్పీలో మొదటి స్థానంలో ఉంది. రెండవ స్థానంలో 'ప్రేమ ఎంత మధురం' ఉండగా, మూడవ స్థానంలో 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఉంది. బ్రహ్మముడి సీరియల్ సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 గంటలకు స్టార్ మా టీవీలో ప్రసారమవుతుంది. ఈ సీరియల్ లో రోజు రోజుకి కథలో ట్విస్ట్ లతో ఆసక్తికరంగా సాగుతుంది. అందుకే ఈ సీరియల్ కి తెలుగు రాష్ట్రాలలోనే కాదు అంతటా ఆదరణ ఎక్కువగా ఉంది. కారణం ఈ సీరియల్ లో ప్రతీ మధ్యతరగతి కుటుంబాన్ని ప్రతిబింబించేలా ఎమోషన్స్ ని చూపిస్తున్నారు.

మధ్యతరగతి కుటుంబం యొక్క అవసరాలు, వాటి కోసం వారు చేసే అప్పులు, వాటిని తట్టుకోలేక వారు సర్దుకుపోయేతత్వాలు ఇలా అన్ని ఎమోషన్స్ ని కలిపి కనకం-కృష్ణమూర్తిల కుటుంబాన్ని చూపిస్తున్నారు. మరొకవైపు ‌ధనవంతులు సమాజం ఎలా ఉంటారు.. వారి  అటిట్యూడ్ ఎలా ఉంటుంది.. వారు మధ్యతరగతి వాళ్ళని ఎలా చూస్తారనేది దుగ్గిరాల కుటుంబాన్ని ప్రతిబింబించేలా చూపిస్తూ ఈ సీరియల్ ముందుకు సాగుతుంది. కనకం-కృష్ణమూర్తిలకు ముగ్గురు కూతుళ్ళు.. ఒకరు స్వప్న, మరొకరు కావ్య, ఇంకొకరు అప్పు.. కనకం వీళ్ళందరిని బాగా డబ్బున్నవాళ్ళకి ఇచ్చి పెళ్ళి చేసి.. మేం పడే కష్టాలు మా పిల్లలు పడకూడదని ఆశపడుతుంటుంది.

అలాగే పెద్ద కూతురు స్వప్న తన తల్లి బాటలోనే ఉండాలనుకుంటుంది. చేసుకుంటే బాగా డబ్బున్న వాడినే చేసుకోవాలని కలలు కంటూ ఉంటుంది. కృష్ణమూర్తి మాత్రం నీతిగా, నిజాయితీగా బ్రతకాలని.. ఉన్నంతంలో హుందాగా బ్రతకాలని వాళ్ళ కూతుళ్ళకి భార్య కనకంకి చెప్తుంటాడు. చివరి అమ్మాయి అప్పు మాత్రం చదువుకుంటూ, పార్ట్ టైం జాబ్ చేస్తూ తన ఖర్చులకు తను డబ్బులు సమకూర్చుకుంటూ ఎవరికీ భారంగా ఉండాలనుకుంటుంది.    అయితే తాజాగా జరుగుతున్న సీరియల్ ఎపిసోడ్ లలో కథ పూర్తిగా మలుపు తిరిగింది.

దుగ్గిరాల కుటుంబంలోని అపర్ణ వాళ్ళ కొడుకు  రాజ్ కి కనకం కూతురు స్వప్న నచ్చి పెళ్ళిచేసుకుందామనేసరికి తను పెళ్ళిపీటల మీద నుండి లేచిపోతుంది. దాంతో రాజ్ మేనత్త రుద్రాణి కనకం రెండవ కూతురు కావ్యని పెళ్ళిపీటల మీద కూర్చోబెట్టి రాజ్, కావ్యలకి పెళ్ళి చేస్తుంది. ఈ విషయం భరించలేని రాజ్ వాళ్ళ అమ్మ అపర్ణ చాలా కోపంగా ఉంటూ.. కావ్యని ఒక స్టోర్ రూమ్ లో ఉండమని చెప్తుంది. ఇక దుగ్గిరాల కుటుంబం యొక్క ఇంటిపెద్ద  సీతారామయ్య మాటకి కట్టుబడి కావ్యని ఏమీ అనలేకపోతుంటారు. స్వప్నని తీసుకెళ్ళింది రాహులేనని కావ్యకి తెలిసిపోతుంది. అయితే ఈ విషయాన్ని కావ్య నిరూపించడానికి తగిన ఆధారాలు సేకరించి అందరిముందు నిరూపిస్తుంది.

ఆ తర్వాత స్వప్న, రాహుల్ ల పెళ్ళి జరుగుతుంది. అయితే స్వప్న ప్రెగ్నెంట్ కాదనే విషయం కావ్యకి తెలిసిపోతుంది. కావ్య పెళ్ళి ఆపాలని చూస్తుంది. కానీ అప్పటికే రాహుల్-స్వప్నల పెళ్ళి జరుగుతుంది. ఇక స్వప్నని ఒంటరిగా గదిలోకి తీసుకెళ్ళిన కావ్య ఎందుకు మోసం చేసావని నిలదీస్తుంది. ఆ తర్వాత కావ్యని స్వప్న ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. కావ్య తన కుటుంబానికి అండగా ఉండాలని రాజ్ కి తెలియకయండా డిజైన్స్ వేస్తుంటుంది. అయితే రాజ్ కావ్య వేసిన డిజైన్స్ చూసేస్తాడు. కావ్య డిజైన్స్ కి వచ్చిన డబ్బులను తీసుకెళ్ళి వాళ్ళ ఇల్లు తాకట్టు పెట్టకుండా అడ్డుకుంటుంది. కనకం, కృష్ణమూర్తి హ్యాపీగా ఫీల్ అవుతారు. మరొకవైపు కళ్యాణ్ రాసిన కవితలను ఇష్టపడుతున్న ఆ అజ్ఞాత అభిమాని ఎవరని ఇంకా తెలియకుంది. స్వప్న ప్రెగ్నెంట్ కాదనే విషయాన్ని ఇంట్లో చెప్పకుంటే కావ్య చెప్పేస్తానని చెప్పింది. మరి స్వప్న విషయం కావ్య ఇంట్లో చెప్పేస్తుందా? కళ్యాణ్ కవితలని ఇష్టపడే అభిమాని ఎవరో తెలుసుకుంటాడా? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ సీరియల్ అత్యంత వీక్షకాదరణ పొందుతూ నెంబర్ వన్ స్థానాన్ని చేరుకుంది.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.